కాకర కాయలు 3, మెంతులు 2 స్పూన్లు, ఆవాలు రెండు స్పూన్లు, కారం  5 స్పూన్లు, చింతపండు చిన్న నిమ్మకాయంత, ఇంగువ, నూనె తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు

ముందుగా కాకరకాయలు ముక్కలుగా తరగాలి. వీటిని కొంచెం నూనెలో ఎర్రగా వేయించాలి

ఒక బాణలి లో మెంతులు, ఆవాలు వేయించాలి. వీటిని రోటిలో  వేసి పొడి చేయాలి

చింతపండు వేడి నీటిలో నానబెట్టి చిక్కగా రసం తియ్యాలి

కాకరకాయ ముక్కలలో చింతపండు రసం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, కారము కలిపి, రోట్లో వేసి చిన్నగా దంచాలి

చివరిగా కొంచెం నూనెలో ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పోపు పెట్టాలి

ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ