అవోకాడో శాండ్విచ్ సులభంగా ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం

అవకాడో శాండ్విచ్ చేయడానికి కావలసినవి బ్రెడ్ స్లైసులు, ఉప్పు, వెన్న, నల్ల మిరియాలు, రోజ్మేరీ ఆకులు, రెమ్మలు అవకాడో, టొమాటోలు, క్రీమ్ చీజ్, మిరపకాయ పొడి

శాండ్‌విచ్ చేయడానికి ముందుగా అవకాడో గింజను తీసివేసి, కూరగాయలను కడిగి, కావలసిన ఆకారాలలో కట్ చేసుకోండి

ఇంతలో బ్రెడ్ స్లైసులను రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి

దీని తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వెన్న, క్రీమ్ చీజ్, ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి పొడి, మిరపకాయ, రోజ్మేరీ ఆకులను జోడించండి

మిశ్రమాన్ని బాగా కలపండి.. రోస్ట్ చేసి బ్రెడ్ ముక్కలపై అందంగా పేర్చండి

దీని తర్వాత.. బ్రెడ్ స్లైస్‌లపై చీజ్‌ను వేయండి

దానికి ఉప్పు, మిరియాలు, రోజ్మేరీతో పాటు కూరగాయలను వేసి ఆనందించండి