మొదట 50 గ్రాముల సెమీ-స్వీట్ చాక్లెట్ లేదా మీకు నచ్చిన ఏదైనా ఇతర చాక్లెట్‌ను 6 నుంచి 7 టేబుల్ స్పూన్లు తరిగి ఉంచండి

ఈ తరిగిన చాక్లెట్‌ను చిన్న గిన్నెలో వేసి పక్కన పెట్టండి

పాలను వేడి చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్స్‌ పాలు తీసుకోండి

ఇప్పుడు పాలలో 2 టేబుల్ స్పూన్ల వైట్ గ్రాన్యులేటెడ్ షుగర్ లేదా మాపుల్ సిరప్ కలపండి

మీరు ఉపయోగించే చాక్లెట్ రకాన్ని బట్టి అది ఎంత తీపిగా ఉంటుందో తెలుసుకొని సరిపడ చక్కెరను కలపండి

మంటను మధ్యస్థంగా తగ్గించి పాలను వేడి చేయడం ప్రారంభించండి. తరచుగా కలపండి. తద్వారా చక్కెర కరిగిపోతుంది

పాలు నెమ్మదిగా మరిగిన వెంటనే మంటను ఆపివేసి, గిన్నెను మంట నుంచి దింపండి

తరిగిన చాక్లెట్ ఉన్న గిన్నెలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వేడి పాలు పోయాలి. చాక్లెట్ కరిగించడానికి బాగా కలపండి

ఇప్పుడు ఈ కరిగించిన చాక్లెట్‌ను వేడి పాలలో కలపండి. ఒక కప్పులో వేడి చాక్లెట్ పోయాలి

1 నుంచి 2 టేబుల్ స్పూన్ల విప్డ్ క్రీమ్, చాక్లెట్ షేవింగ్స్, కొద్దిగా కోకో పౌడర్ పైన చల్లండి. అంతే వేడి వేడి చాక్లెట్ రిసిపి తయారవుతుంది