సోయా ఉప్మా కోసం కావాల్సిన పదార్ధాలు సోయా గింజలు లేదా సోయా గింజల పొడి, ఉల్లిపాయ, అల్లం, పచ్చి మార్చి, క్యారెట్, బఠాణీలు, క్యాబేజీ, కొత్తిమీర, జీలకర్ర, మినప పప్పు, ఉసిరి పప్పు, జీడిపప్పు, నూనె, ఉప్పు

ముందుగా సోయా గింజలను లేదా సోయా బీన్ పౌడర్ ను వేడి నీటిలో 15 నుంచి 20 నిముషాల పాటు నానబెట్టుకోవాలి

తర్వాత దానిని పిండి ఒక పక్కన పెట్టుకోవాలి

ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె వేసి వేడిచేసుకోవాలి 

అందులో జీలకర్ర, మినపప్పు వేసుకుని వేయించుకుని తర్వాత అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని కొంచెం సేపు వేయించాలి

అనంతరం కట్ చేసిన ఉల్లిపాయను వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ తరిగిన క్యాబేజీ, క్యారేట్ ను వేసుకుని స్విమ్ మీద పెట్టి వేయించుకోవాలి

తర్వాత జీడిపప్పు వేసి చివరిగా పిండి పక్కకు పెట్టిన సోయా పౌడర్ ను వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. కొంచెం సేపు ఉడికించాలి

స్టౌ మీద దింపే ముందు నిమ్మరసం పిండి కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ సోయా ఉప్మా రెడీ