బొంబాయి రవ్వ, అరకిలో పంచదార, పావు కిలో ఎండుకొబ్బరి పొడి, జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్, యాలకుల పొడి, నెయ్యి, ఒక కప్పు పాలు (కాచి చల్లార్చిన)

ముందుగా స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి

వేయి వేడి ఎక్కిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పులు, కిస్మిస్ లు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి

అనంతరం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి తురుముని వేయించుకోవాలి

దీనిని కూడా బాణలి నుంచి తీసుకుని అందులో ఇప్పుడు తీసుకున్న బొంబాయి రవ్వని వేసుకుని స్టౌ మంటను స్విమ్ లో పెట్టుకుని ఎర్రగా కమ్మటి వాసన వచ్చే వరకూ రవ్వని వేయించుకోవాలి

ఈ బొంబాయి రవ్వని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అనంతరం మిక్సీలో పంచదార, యాలకులు వేసుకుని బరకగా ఉండేలా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి

ఇప్పుడు వేయించిన రవ్వలో మిక్సీలోని పంచదార పొడి .. వేయించుకున్న జీడిపప్పు, బాదాం, కిస్మిస్, లతో పాటు కొబ్బరి తురుము వేసుకుని కొంచెం పాలు పోసుకుని ఉండలు చుట్టుకోవాలి

అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డు రెడీ. ఇవి సుమారు ఒక వారం రోజులపాటు నిల్వ ఉంటాయి