కావాల్సిన పదార్ధాలు ఓరియో బిస్కెట్ ఒక పేకేట్, పాలు ఒక కప్పు, ఈనో ఒక పేకెట్, గిన్నె నూనె లేదా నెయ్యి, కొంచెం మైదా, డ్రై ఫ్రూట్స్  

ముందుగా ఒక మిక్సీ గిన్నెను తీసుకుని దానిలో ఓరియో బిస్కెట్ ను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి

 అనంతరం పాలు ఈనో పేకట్ వేసుకుని మిక్సీ పట్టాలి

తర్వాత కేక్ తయారు చేసుకోవడానికి ఒక దళసరి గిన్నెను తీసుకుని దాని అంచులకు చుట్టూ.. నెయ్యి లేదా నూనె పూయాలి

తర్వాత మైదా గిన్నె చుట్టూ చల్లాలి. అప్పుడు మిక్సీ పట్టుకున్న ఓరియో బిస్కెట్ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకుని.. బబుల్స్ లేకుండా చేసుకోవాలి

తర్వాత ఒక పాన్ తీసుకుని దానిలో ఉప్పు లేదా ఇసుక వేసుకొని చదునుగా పరుచుకోవాలి 

అందులో గిన్నె నిలబడానికి ఒక చిన్న స్టాండ్ లేదా ప్లేట్ ను పెట్టుకుని దానిపై ఓరియో బిస్కెట్ మిశ్రమాన్ని ఉన్న గిన్నెలు పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 30 నిముషాలు స్విమ్ లో ఉడికించాలి

అనంతరం కేక్ ఉడికిందో లేదో చూసుకుని అంచులు చుట్టూ జాగ్రత్తగా లూజ్ చేసుకుని గిన్నె నుంచి మరొక ప్లేట్ లోకి తీసుకుంటే ఓరియో బిస్కెట్ స్పాంజ్ కేక్ రెడీ