బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు ఇటు రాజమౌళి ఇద్దరూ కూడా తాము కలిసి సినిమా చేస్తున్నామనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

మ‌హేష్‌తో గ్లోబ‌ల్ మూవీగా, యాక్షన్ అడ్వెంచ‌ర‌స్ జోన‌ర్‌లో సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నట్లు రాజ‌మౌళి ఎప్పుడో చెప్పేశారు.

 ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ తరువాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా ప్రారంభించనున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే ఏకంగా 15 కోట్ల రూపాయల వరకు జక్కన్న ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇండియ‌న్ సినిమా హిస్టరీలోనే ఇప్పటి వ‌ర‌కు రూపొంద‌ని విధంగా రూ.800 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో SSMB29 ను రూపొందించ‌టానికి రాజ‌మౌళి ప్లాన్ చేశార‌ట‌.