‘నచ్చావులే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి మాధవీ లత.
తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది.
ఆ తర్వాత స్నేహితుడా, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలకు దూరంగా ఉంటుంది.
తాజాగా ఈ భామ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తరచు పెళ్లి గురించి అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారో తెలియదు కానీ.. మాధవీ మాత్రం సోషల్ మీడియా ద్వారా సమాజంపై ఫుల్ ఫైర్ అవుతోంది.
ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వయసు ఒకటే సరిపోదు. ఆమె శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవటం అనేది ఆమె నిర్ణయం.
ప్రస్తుతం నేను శారీకంగానూ, మానసికంగానూ పెళ్లికి రెడీగా లేను.
నా భవిష్యత్తుపై కూడా నమ్మకంగా లేను. ఇది నా నిర్ణయం. నా జీవితం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.