ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారకం పొగ తాగటం. అలాగని పొగ తాగనివారికి రాకూడదనేమీ లేదు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడుతున్నవారిలో సుమారు 20% మంది సిగరెట్ల జోలికి వెళ్లనివారే.

మరి దీని ముప్పును తగ్గించుకునేదెలా అని ఆలోచిస్తున్నారా? రోజూ పెరుగు, అలాగే ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోండి.

రోజుకు సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు 19% వరకు తక్కువ అని అధ్యయనం సూచిస్తోంది.

అలాగే పీచు లభించే పదార్థాలు ఎక్కువగా తీసుకున్నవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం 17% తక్కువగా ఉంట్టున్నట్ట బయటపడింది.

మొత్తం 14 లక్షల మందిపై నిర్వహించిన 10 అధ్యయనాల ఫలితాలను విశ్లేషించి దీన్ని గుర్తించారు. కొద్దిమొత్తంలో పెరుగు, పీచును తీసుకున్నా క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంటం విశేషం.

అంటే చిన్న చిన్న మార్పులతోనే పెను ప్రమాదాన్ని నివారించుకునే వీలుంటోందన్నమాట.