08 February 2024
TV9 Telugu
అప్పుడెప్పుడో 30-40 ఏండ్ల క్రితం మార్కెట్‌లో హల్‌చల్ చేసిన లూనా.. మళ్లీ కొత్త రూపులో ముందుకొచ్చింది.
'ఈ-లూనా' పేరుతో దీన్ని దేశీయ మార్కెట్‌కు బుధవారం కైనెటిక్ గ్రీన్ పరిచయం చేసింది. అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి.
ఈ విద్యుత్తు ఆధారిత (ఈవీ) ద్విచక్ర వాహనం.. రైతులు, చిరు వ్యాపారుల వినియోగానికి, వస్తూత్పత్తుల డెలివరీలకు ఉపయోగం.
వెనుక సీటును వేరుచేసుకునే సదుపాయం. దీనిపై సిలిండర్లు, పెట్టెలు, ఇతరత్రా సామాగ్రిని సులువుగా తరలించవచ్చు.
ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.69,990. మల్‌బెర్రీ రెడ్, ఓషియన్ బ్లూ, పియర్ల్ ఎల్లో, స్పార్క్‌లింగ్ గ్రీన్, నైట్ స్టార్ బ్లాక్ రంగుల్లో లభ్యం.
ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఒకినావా డ్యూయల్ 100, టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 తదితర మాడళ్లకు పోటీనివ్వగదని తెలుస్తోంది.
యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్. 4 గంటల్లో పూర్తిగా చార్జింగ్. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
1.2కిలోవాట్ మిడ్- మౌంటెడ్ మోటర్. గరిష్ఠ వేగం గంటకు 50 కిలోమీటర్లు. 150 కిలోల వరకు బరువును మోయగలదు.