Krunal Pandya: కెప్టెన్సీ అరంగేట్రంలోనే చెత్త రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో ముగ్గురు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ గాయపడ్డాడు.

దీంతో కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. కెప్టెన్‌గా ఇది అతనికి IPLలో మొదటి మ్యాచ్.

కానీ, ఈ మ్యాచ్‌లో కృనాల్ నిరాశపరిచి చెత్త రికార్డులో తన పేరును నమోదు చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో కృనాల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. మొదటి బంతికే ఔటయ్యాడు.

అతడిని చెన్నై మిస్టరీ స్పిన్నర్ మహిష్ తీక్షణ తొలి బంతికే అవుట్ చేశాడు. దీంతో కృనాల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.

ఐపీఎల్‌లో కెప్టెన్సీ అరంగేట్రంలోనే గోల్డెన్ డక్‌కి గురైన మూడో కెప్టెన్‌గా కృనాల్ నిలిచాడు.

అతడి కంటే ముందు ఐపీఎల్‌ తొలి సీజన్‌లో డెక్కన్‌ చేజర్స్‌ కెప్టెన్‌ వీవీఎస్‌ కోల్‌కతాపై తొలి బంతికే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

ఆ తర్వాత అదే సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ కూడా లక్నోతో జరిగిన తొలి బంతికే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.