గుంటూరు జిల్లా దేవరంపాడు గుట్టపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి..

 స్వామికి పాడిపశువులు ఈనిన తరువాత మొదట వచ్చిన వెన్నతో అభిషేకించడం ఆనవాయితీ

ఈ ఆలయంలో స్వామిపై కప్పు లేకపోవడంతో మధ్యాహ్నం మూలవిరాట్‌ను తాకే భానుడి కిరణాలు

ఎండవేడికి వెన్న కరిగి నెయ్యిలా మారి ఆ నేతిలో శ్రీవారు మత్స్య రూపంలో జలకాలాడుతున్నట్లు దర్శనం

ఇక్కడ స్వామివారు మత్స్య రూప నేతి వెంకన్నగా ప్రసిద్ధి

జిల్లాలో కోటప్పకొండ తరువాత పెద్దది ఈ క్షేత్రం

పల్నాటి తిరుమలగా వినుతి కెక్కిన నేతి వెంకన్న క్షేత్రం 

ఏటా శివరాత్రి తర్వాత వచ్చే మొదటి శనివారం తిరునాళ్ళు ప్రారంభం.. 3 శనివారాలు నిర్వహణ 

పిల్లలులేని దంపతులు ఆలయ ఆవరణలోని మర్రిచెట్టుకు ముడుపులు కట్టి, ప్రత్యేక పూజలు 

రైతులు జోడెడ్ల బండ్లకు  ప్రభలు కట్టి, ఉత్సాహంగా  కొండకు ప్రదక్షిణ