గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ప్రసవం వరకు గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ప్రెగ్నెన్సీ సమయంలో మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో తాజా పండ్లను తినడం చాలా ముఖ్యం. 

ప్రెగ్నెన్సీ సమయంలో తినాల్సి ఫ్రూట్స్‌ ఏమిటో చూసేయండి

అరటి పండు తింటే వారికి కడుపు నిండిన ఫీలింగ్‌ వస్తుంది. ఎక్కువగా తినాలనే కోరికను కంట్రోల్‌ చేస్తాయి.

కివీ తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి. ప్రెగ్నెన్నీ సమయంలో జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని కివీ రక్షిస్తుంది.

జామకాయ జీర్ణక్రియ మెరుగ్గా జరగడానికి సహాయపడుతుంది. శిశువు యొక్క నాడీ వ్యవస్థకు బలాన్ని అందిస్తుంది.

గర్భదారణ సమయంలో ఆపిల్‌ తింటే శిశివు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డకు పుట్టిన తర్వాత శ్వాసకోస సమస్యలు, ఆస్తమా, దగ్గు, తామర వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

కమల పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి.. శిశువు ఎముకలు, దంతాల నిర్మాణం, పెరుగుదలకు అవసరం.

ఎండిన ఆప్రికాట్‌లలో ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.