చలికాలంలో మృదువైన అధరాలను సొంతం చేసుకోవాలంటే..
రెండు చెంచాల చక్కెరకు, చెంచా తేనె కలిపి పెదవులకు రాసుకుని, పెదవుల చుట్టూ మెల్లగా రుద్దితే మృదువుగా ఉంటాయి
పగిలిన పెదాలకు కొబ్బరినూనె రాసుకుంటే సహజసిద్ధ్దమైన మాయిశ్చరైజర్‌లా పని చేసి తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది
కొబ్బరినూనెకు బదులు ఆలివ్ ఆయిల్‌ని కూడా ఉపయోగించవచ్చు
పెదవులపై వెన్న రాసుకొని 10 నిమిషాల పాటు ఆరచ్చి, గోరువెచ్చని నీళ్లలో ముంచిన దూదితో శుభ్రం చేసుకుంటే మృదువుగా మారతాయి
కొన్ని గులాబీ రేకులు 5 గంటల పాటు పాలలో నానబెట్టి ముద్దలా చేసుకోవాలి
దీనిని రోజుకు 2,3 సార్లు రాసుకుంటూ ఉంటే పెదవులు లేత గులాబి రంగును సంతరించుకుంటాయి
పెదవులపై ఏర్పడే మృతకణాలను ఎప్పటికప్పుడు బ్రష్‌తో తొలగించుకుంటూ ఉండాలి