ఫిఫా ప్రపంచకప్‌ 2022లో అవార్డులు పొందిన ప్లేయర్లు వీరే..

ఫిఫా వరల్డ్ కప్ 2022 టైటిల్‌ను అర్జెంటీనా గెలుచుకుంది.

ఫైనల్ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ జట్టు ఫ్రాన్స్‌ను ఓడించింది.

అయితే ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఫలితం పెనాల్టీ షూటౌట్‌లో వచ్చింది.

ఫిఫా ప్రపంచకప్‌లో అవార్డులు పొందిన ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

లియోనెల్ మెస్సీకి గోల్డెన్ బాల్ అవార్డు లభించింది.

21 ఏళ్ల ఎంజో ఫెర్నాండెజ్‌కు యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించింది.

ఫ్రాన్స్‌కు చెందిన ఎంబాప్పే గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది.

మిలియానో ​​మార్టినెజ్ బెస్ట్ గోల్‌కీపర్‌గా ఎంపికయ్యాడు.