అందుబాటులోకి యూట్యూబ్ సరికొత్త ఫీచర్‌

07 December 2024

TV9 Telugu

తాజాగా స్మార్ట్‎ఫోన్‎లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్.

యూట్యూబ్ యాప్‌లో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను ప్రారంభించింది. ఏకకాలంలో వీడియోతోపాటు చాటింగ చేసుకోవచ్చు.

చిన్న విండోలో వీడియోలను ప్లే చేయవచ్చు. మిగిలిన స్క్రీన్‌లో చాటింగ్ చేయవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ స్పిల్ట్-స్క్రీన్‌ని సపోర్ట్ చేస్తే చాలు.

ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో ప్రత్యేక ట్యాబ్‌లు లేదా విండోల్లో యూట్యూబ్‎ని తెరవడం, చాటింగ్ యాప్‌లను ఉపయోగించి మల్టీ టాస్క్ ఇప్పటికే ఉంది.

యూట్యూబ్‎ ప్రీమియం వినియోగదారులు పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్‌లను పొందుతారు. దీంతో చాట్ చేస్తున్నప్పుడు వీడియోలను చూడవచ్చు.

యూట్యూబ్‎ చూస్తున్నప్పుడు, ల్యాప్‌టాప్‌లో WhatsApp వెబ్ లేదా ఇతర చాటింగ్ ప్లాట్‌ఫారమ్‌లను తెరిచి, రెండు పనులను ఒకేసారి చేయండి.

కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు యూట్యూబ్ వీడియోలో చాటింగ్ యాప్‌ను తెరవడానికి మిమ్మల్ని అనుమతించే ఓవర్‌లే ఫీచర్‌లను అందిస్తాయి.

స్మార్ట్‎ఫోన్ నుంచి యూట్యూబ్‎ని టీవీకి ప్రసారం చేయండి. HDMI కేబుల్ లేదా వైర్‌లెస్ కాస్టింగ్‌తో ఫోన్‌లో చాట్ చేయండి.