మెనోపాజ్ సమస్య ఉన్నవారు ఈ ఆహార పదార్ధాలు తీసుకోవడం తప్పనిసరి
TV9 Telugu
26 June 2024
మెనోపాజ్ ఉన్న మహిళలు ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. కాలే, పాలకూర, బచ్చలికూర, బ్రకోలీలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కూరగాయలు-పండ్లు
అలానే పండ్లలో బెర్రీలు, యాపిల్స్, సిట్రస్ పండ్లు తీసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలానే టొమాటో, గుమ్మడి, క్యారట్, బొప్పాయి లాంటి వాటిని కూడా తీసుకోవాలి.
కూరగాయలు-పండ్లు
సోయాలో ఉండే ఈస్ట్రోజెన్ మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. అలానే హృదయ సంబంధ సమస్యలు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి
సోయా ఉత్పత్తులు
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉండే పదార్ధాలు సాల్మన్, సార్డినెస్, మాకేరెల్, అవిసె గింజలు, డ్రైఫ్రూట్స్ మీ డైట్‌లో చేర్చుకోండి. ఇవి గుండె జబ్బులు, డయాబెటిస్ గ్గించడంలో సహాయపడుతుంది
ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్
బ్రౌ న్ రైస్, క్వినోవా, బార్లీ వంటి తృణధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. గుండె సమస్యలు, హార్మన్ అసమతుల్యత, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
తృణధాన్యాలు
నట్స్, విత్తనాల తీసుకుంటే కడుపును నిండుగా ఉంచుతాయి. నట్స్‌లో ఫైటోఈస్ట్రోజెన్స్ ఉంటాయి. ఇవి వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, వంటి మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
నట్స్
ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం, విటమిన్ డి చాలా అవసరం. మీ డైట్‌లో పాలు, పెరుగు, చీజ్, కాలే, బచ్చలికూర, బ్రోకలీ వంటివి తీసుకోండి. ఉదయం పూట సూర్యరశ్మిలో కొంతసేపు ఉంటే.. విటమిన్ D సమృద్ధిగా ఉంటుంది.
కాల్షియం, విటమిన్ డి..
పెరుగు, దోశ, ఇడ్లీ వంటి పులియబెట్టిన ఆహార పదార్థాల్లో గట్ ఆరోగ్యం, జీర్ణక్రియకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ ఆహారాలలో ఫైటో ఈస్ట్రోజెన్లు కూడా ఉంటాయి.