ఢిల్లీలో ఎర్రకోటను ఎవరు.. ఎప్పుడు నిర్మించారు?

15 August 2025

Prudvi Battula 

ఈరోజు భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి.

 భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఎర్రకోట ఢిల్లీలో ఉన్న ఒక చారిత్రాత్మక, ప్రసిద్ధ స్మారక చిహ్నం. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు.

మొఘల్ మహారాజు షాజహాన్ అసలు ఢిల్లీలో ఎర్రకోటను ఎప్పుడు నిర్మించాడో ఈరోజు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం.

షాజహాన్ తన కొత్త రాజధాని షాజహానాబాద్ ప్రధాన రాజభవనంగా ఢిల్లీలో ఎర్రకోటను నిర్మించాడని చరిత్ర చెబుతుంది.

గతంలో మొఘలుల రాజధాని ఆగ్రా, అయితే చక్రవర్తి షాజహాన్ 1638లో రాజధానిని ఢిల్లీకి మార్చాలని నిర్ణయించుకున్నాడు.

షాజహాన్ ఢిల్లీలో నిర్మించిన ఎర్రకోటను తన కుమారుడు దారా షికోని వారసుడిగా అప్పగించాడని చరిత్రకారులు అంటున్నారు.

ఎర్రకోట నిర్మాణం 1638లో ప్రారంభమై, 1648లో పూర్తయింది. అంటే దీనిని నిర్మించడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది.

ఈ కోట గోడలు దాదాపు 2.4 కిలోమీటర్ల పొడవు, 18 నుండి 33 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఇది 254.67 ఎకరాల్లో విస్తరించి ఉంది.