సిలిండర్‌లో గ్యాస్ పరిమాణం ఎంత ఉంటుందంటే.?

TV9 Telugu

13 December 2024

పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారతదేశంతో పాటు మరి కొన్ని దేశాల్లో గ్యాస్ సిలిండర్ల వినియోగం బాగా పెరిగింది..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వల్ల అనేక రకాల వంటలు చేయడం చాలా సులువుగా మారింది.

మునుపటిలాగా ఆహారాన్ని వండుకోవడానికి స్టవ్‌ని గంటల తరబడి వేడి చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్‌ను నేరుగా వెలిగించి నిమిషాల్లో వండుకోవచ్చు.

గ్యాస్ సిలిండర్‌లో నింపిన గ్యాస్ పరిమాణం 14 కిలోల 200 గ్రాములు ఉండాలి. ఖాళీ సిలిండర్ బరువు 15 కిలోల నుండి 16.5 కిలోల వరకు ఉంటుంది.

ఒక్కో సిలిండర్ పైభాగంలో బరువు రాసి ఉంటుంది. దీన్ని కచ్చితంగా గమనించండి. తక్కువ ఉండే వెంటనే మార్చండి.

మీరు వాడుతున్న ఖాళీ సిలిండర్ బరువు 16 కిలోలు అయితే, గ్యాస్ నింపిన సిలిండర్ బరువు 30 కిలోల 200 గ్రాములు.

మీ ఇంట్లో వంట కోసం వాడుతున్న సిలిండర్‌లో ఎప్పటికప్పుడు గ్యాస్‌ నింపాల్సి ఉంటుంది. లేదంటే సమస్యలు వస్తాయి.

కొన్నిసార్లు గ్యాస్ వెంటనే రీఫిల్ చేయడం సాధ్యం కానప్పుడు, సింగిల్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతుంటారు.