రైల్వే ట్రాక్స్ ఎందుకు తుప్పు పట్టవు.? అసలు కారణం ఏంటి.?

26 August 2025

Prudvi Battula 

గత పది సంవత్సరాలలో భారతీయ రైల్వే 31 వేల కిలోమీటర్ల పొడవున రైల్వే ట్రాక్‌ను నిర్మించింది. ఇందులో అనేక విశేషాలు ఉన్నాయి.

భారతీయ రైళ్లు నడిచే ట్రాక్‌లు ఎందుకు తుప్పు పట్టవని మీరెప్పుడైనా గమనించారా? అందుకు కారణం తెలుసుకోండి.

రైల్వే ట్రాక్‌లపై తుప్పు పట్టకపోవడానికి కారణం దాని మెటీరియల్‌. ఇది మాంగనీస్‌ కలిగి ఉన్న ఒక ప్రత్యేక రకమైన ఉక్కుతో తయారు చేస్తారు.

ట్రాక్‌లలో ఉపయోగించే ఉక్కులో 12 శాతం మాంగనీస్‌, 0.8 శాతం కార్బన్‌ ఉంటుంది. వీటిపై ఐరన్‌ ఆక్రైడ్‌ ఏర్పడదు. అందువల్ల తుప్పు పట్టవు.

ఎరుపు రంగు కోచ్‌లలో డిస్క్‌ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి రైలును త్వరగా నిలిపేలా చేస్తాయి. ఇది రాజధాని,  శతాబ్ది రైళ్లలో ఉపయోగిస్తారు.

రైల్వే ట్రాక్‌లపై ఐరన్‌ ఆక్రైడ్‌ ఏర్పడకపోవడం వల్ల అవి తుప్పు పట్టకుండా సురక్షితంగా ఉంటయి. ఎప్పుడు ట్రాక్‌లు మెరుస్తూనే కనిపిస్తాయి.

పట్టాలు తేడా అనిపించినా రైల్వే సిబ్బంది వెంటనే ఆ పట్టాలను మార్చేస్తుంటారు. తుప్పు పట్టకుండా ఓ కోటింగ్ కూడా వేస్తారు. రైళ్లు వెళ్తున్న సమయంలో పట్టాలు ఒత్తిడికి గురై తుప్పు పట్టవు.

ఒకవేళ తుప్పు పట్టినా.. తుప్పు రేటు ఏడాదికి 0.05 మి.మీ ఉంటుందట. అంటే 1 మి.మీ మేర తుప్పు పట్టడానికి 20 సంవత్సరాలు పడుతుంది.