వామ్మో..చియా సీడ్స్‌ నానబెట్టకుండా తింటే ఇంత డేంజరా..? 

18 September 2025

Jyothi Gadda

చియా సీడ్స్​తో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వివిధ పోషకాలతో నిండిన చియా గింజలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. 

చియాసీడ్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి వివిధ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 

చియా గింజలలో ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరు, గుండె ఆరోగ్యానికి మంచిది.

చియా గింజలను తినడానికి ముందు నానబెట్టాలి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. చియా గింజలను నానబెట్టకుండా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదు. 

చియా విత్తనాలు వాటి బరువు కంటే 10-12 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకోగలవు. పొడిగా తిన్నప్పుడు అవి నీటిని పీల్చుకుని మీ గొంతు లేదా అన్నవాహికలో ఉబ్బి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

చియా గింజలు కడుపులోని నీటిని కూడా పీల్చేస్తాయి. ఇది మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. వాటిని జీర్ణం చేయడానికి శరీరం మరింత కష్టపడాల్సి ఉంటుంది.

అందుకే చియాసీడ్స్‌ పాలు లేదా పెరుగులో రాత్రంతా నానబెట్టండి. ఉదయం, తాజా పండ్లు, గింజలు, కొద్దిగా తేనె వేసుకుని తింటే మీకు మంచి బలమైన బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది.

చియా విత్తనాలను నానబెట్టడం వల్ల వాటి పోషకాలు శరీరానికి మరింతగా అందుతాయి. కానీ వాటిని నానబెట్టకుండా తినడం వల్ల అవి పూర్తిగా గ్రహించబడకపోవచ్చు.