నిమ్మరసం తేనెలో కలిపి తాగితే ఆరోగ్యం... పులిహోరలో వాడితే మంచి రుచి... నిమ్మ కాయలతో కమ్మటి పచ్చళ్లు ఇంకా రకరకాల వంటల్లో కూడా వాడేస్తుంటాం
TV9 Telugu
ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి ఎక్కువగా అందుతుంది. అంతేకాదూ ఎ, ఇ, బీ6, విటమిన్లూ, ఇనుము, రాగి, మెగ్నీషియం, క్యాల్షియం, రైబోఫ్లావిన్, జింక్ వంటివీ అందుతాయి
TV9 Telugu
ఎండల్లో దాహాన్ని తీర్చడంలో నిమ్మకాయ నీళ్లు చక్కటి ఎంపిక. దీంట్లో పోషకాలు, రోగనిరోధకతను పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండే నిమ్మ ఏడాది పొడవునా దొరుకుతుంది
TV9 Telugu
ప్రతిసారి చక్కెరో, ఉప్పో వేసుకుని తాగే బదులుగా.... మరికొన్ని పండ్లు, పదార్థాలను కలిపి నిమ్మనీళ్లను ఆస్వాదిస్తుంటారు కొందరు. దాహం తీరడంతోపాటు కొత్త రుచులూ తెలుస్తాయి
TV9 Telugu
కొంతమందికి నిమ్మరసం లేకుండా రోజు ప్రారంభం కాదు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నిమ్మరసం తాగడం అలవాటు. నిమ్మరసం నీళ్లు రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
TV9 Telugu
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగడం వల్ల మెటబాలిజం పెరిగి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది
TV9 Telugu
నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గొంతులో గరగరమనిపిస్తే.. వేడి నీళ్లలో చెంచా చొప్పున తేనె, నిమ్మరసం కలిపి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది