చియా సీడ్స్‌లో ప్రోటీన్లు, పీచు పదార్థం ఎక్కువ మొత్తంలో ఉన్నందున ఇవి బరువు తగ్గడంలో ఉపయోగకరంగా ఉంటాయి.
చియా సీడ్స్‌లో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇంకా కడుపు మంట, అజీర్తి, మలబద్ధకం వంటివాటిని నివారిస్తాయి.
చియా విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని నిరోధిస్తాయని పలు అధ్యయనాలు తెలిపాయి. ఫలితంగా మీ శరీరంపై డెడ్ సెల్స్ తొలగిపోతాయి.
ఇంకా చర్మ సమస్యలు తొలగిపోయి మెరిసే నిగారింపును పొందుతారు. ఇవే కాక ముఖంపై మొటిమలు, మచ్చలు, గాట్లు తొలగిపోతాయి.
వీటిల్లో జింక్, ఫాస్ఫరస్, కాల్షియం ఉన్నందున దంత సమస్యలు తొలగిపోతాయి. ఇంకా మీ ఎముకలు ఉక్కు లాగా దృఢంగా మారతాయి.
చియా గింజలు డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లోకి వస్తాయి.
అలాగే చియా గింజలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని కూడా నియంత్రించగలవు. ఫలితంగా గుండెపోటు, రక్తపోటు వంటి హృదయ సంబంధిత సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడతాయి.