బాప్ రే.. పాలకూర తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల
!!
Phani.ch
08 May 2024
మనం వెయిట్ లాస్ కోసం చేసే డైట్ లో అనేక రకాల ఆకుకూరలను తీసుకుంటాం. వీటిలో పాలకూర కూడా ఒకటి. దీన్ని అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పాలకూరలో అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పచ్చగా కనిపించే ఈ ఆకులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
మీరు ప్రతి రోజు తినే ఆహార పదార్దలో పాలకూరను తీసుకోవటంవల్ల శరీరానికి సమతుల ఆహారం దక్కినట్లే. పాలకూరను సలాడ్స్, స్మూథీ, వండుకుని కూడా తీసుకోవచ్చు.
పాలకూరలో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, విటమిన్ కే, సీ, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇది ఎముక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
పాలకూరలో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెజర్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతాయి. దీంతో కార్డియోవాస్క్యూలర్ సమస్య నుంచి కాపాడుతుంది.
అంతేకాదు పాలకూరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడి గుండెను ఆరోగ్యంగా మారుస్తుంది.
పాలకూర జీర్ణ బాగా పనిచేసేలా చేసి మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. అంతేకాదు మంచి పేగు కదలికలకు తోడ్పడుతుంది.
పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల బారినుండి కాపాడుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి