పిస్తా అత్యంత పోషకమైన డ్రై ఫ్రూట్. రోజూ పిస్తాపప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.
పిస్తాలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిస్తాపప్పులో ఉండే విటమిన్ బి6 రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
అన్ని గింజలలో ఫైబర్ ఉంటుంది. ఇది పేగుల ద్వారా ఆహారాన్ని తరలించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
ప్రీబయోటిక్స్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ గట్‌లోని మంచి బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిక్ రోగులకు బెస్ట్ డైట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పిస్తాపప్పు తినడం వల్ల అనేక హృదయనాళ ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పిస్తాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.