సీమ చింతకాయ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

TV9 Telugu

22 June 2024

ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు ప్రతి  చోట అన్ని రకాల పండ్లు దొరుకుతున్నాయి. వీటిని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వీటిలో ముఖ్యంగా సీమ చింతకాయలు. దీని  గురించి చాలా మందికి తెలియదు దీనిని గుబ్బ కాయలు అని కూడా పిలుస్తారు.

సీమచింతతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

విటమిన్‌-సి సమృద్ధిగా ఉన్నందువల్ల సీమ చింతకాయ తింటే శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

సీమ చింతలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌- సి, ఎ, పొటాషియం, ఐరన్‌ లాంటి అనేకానేక విటమిన్లు, మినరల్స్‌ ఇందులో ఉన్నాయి.

ఇందులోని డైటరీ ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచి, ఏకాగ్రతను కలిగించే గుణం వీటిలో వున్నాయి.

బరువు తగ్గాలనుకునేవారికి చీమచింతకాయలు మంచి ఆహారం అంటున్నారు. చీమచింతలో క్యాల్షియం నిల్వలున్న కారణంగా ఎముక బలానికి ఉపయోగపడతాయి.