బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగండి.. బుల్లెట్ స్పీడ్‌లో బరువు తగ్గండి
Phani CH
01 OCT 2024
మారుతున్న జీవన శైలి తో పాటు మనం తినే ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి.. తద్వారా మనుషులు బరువు పెరిగే వేగం కూడా పెరుగుతుంది.
అయితే బరువు తగ్గడం కోసం మన ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
ఈ వరుసలో ముందుగా వచ్చేది బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. అంటే వేడి వేడి కాఫీలో నెయ్యి వేసి చేసుకునే ఈ కాఫీ వల్ల వేగంగా బరువు తగ్గవచ్చని కొందరి అభిప్రాయం.
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే ఓ కీటో డైట్. ఈ కాఫీ కరోనా మహమ్మారి సమయంలో చాలా ప్రజాధరణ పొందింది. అయితే దీని ప్రయోజనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగిన తర్వాత ఏదైనా తిన్నా ఇన్సులిన్ నెమ్మదిగా విడుదలవుతుంది. ఇందులో ఉండే నెయ్యి పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మధుమేహం లేదా జీవక్రియ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ కాఫీని తాగితే చాలా మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
నెయ్యితో చేసిన కాఫీ మహిళలకు అద్భుతంగా పని చేస్తుంది. ఎందుకంటే ఇది హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.
నెయ్యి కాఫీలో కొవ్వు పదార్థం ఉన్నప్పటికీ ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ప్రయోజనాలను పొందేందుకు ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో తాగాలి. శరీరానికి అవసరమైన కొవ్వులు, ప్రోటీన్లను అందిస్తుంది. అలాగే బరువు తగ్గడంలో కూడా సాయం చేస్తుంది.