తీవ్ర అటవీ నిర్మూలన సమస్యలతో పోరాడుతున్న టాప్ 10 దేశాలు ఇవే..
08 April 2025
Prudvi Battula
బ్రెజిల్: ప్రతి సంవత్సరం భారీ విధ్వంసం ఎదుర్కొంటున్న అమెజాన్ వర్షారణ్యంతో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది.
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్: కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ అమెజాన్ తర్వాత రెండవ అతిపెద్ద వర్షారణ్యానికి నిలయం, కానీ అది వేగంగా తన అటవీ ప్రాంతాన్ని కోల్పోతోంది.
ఇండోనేషియా: ఇండోనేషియాలోని పామాయిల్ తోటలు, కాగితం ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున అడవులు నరికివేయబడ్డాయి.
పెరూ: పెరూలోని ఉన్న వర్షారణ్యాలు ప్రధానంగా అక్రమ బంగారు తవ్వకం, వ్యవసాయం కారణంగా కోతకు గురవుతున్నాయి.
కొలంబియా: పశువుల పెంపకం, వ్యవసాయం, అక్రమ కోకా సాగు వంటి అనేక కారణలతో కొలంబియా అడవులు కనుమరుగవుతున్నాయి.
బొలీవియా: వ్యవసాయ విస్తరణ, రహదారుల నిర్మాణం ద్వారా కారణంగా అటవీ నిర్మూలనకు ఆజ్యం పోసింది బొలీవియా దేశం.
మలేషియా: మలేషియాలోని సుసంపన్నమైన ఉష్ణమండల అడవులు చెట్ల నరికివేత, పామాయిల్ తోటల విస్తరణ వలన తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
పరాగ్వే: పరాగ్వేలోని చాకో అడవిని ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ప్రధానంగా పశువుల పెంపకం కోసం నరికివేస్తున్నారు.
మయన్మార్: అక్రమ కలప నరికివేత, వ్యవసాయ విస్తరణ కారణంగా మయన్మార్ దేశం తన అడవులను అతి వేగంగా కోల్పోతోంది.
కంబోడియా: ప్రపంచంలోనే అత్యధిక అటవీ నిర్మూలన రేటు కలిగిన దేశాలలో కంబోడియా ఒకటి. భూములను ఆక్రమించుకోవడం, రబ్బరు తోటలు అడవుల నష్టానికి ప్రధాన కారణాలు.