ఆకాశాన్ని తాకిన టమాటా ధర..

దాదాపు అన్ని వంటకాల్లో టమాటాను ఉపయోగిస్తారు.

టమాటాను చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు.

టమాటాతో పప్పు, పచ్చడి, కూరలు చేసుకొని తింటారు.

అలాంటి టమాటా ధర ఇప్పుడు ఆకాశాన్ని తాకింది.

ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 100కు చేరువైంది.

ఈ ధరలతో ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.

దాంతో సామాన్యులకు టమాటాలు కొనలేని పరిస్థితి వచ్చింది.

గతవారం టమాటా ధర రూ. 80గా ఉండేది.

ప్రస్తుతం టమాటా ధరలకు ప్రజలు కంగు తింటున్నారు.