గార్నిష్‌తో రుచి మాత్రమే కాదు.. ఆహారానికి అందం కూడా..

27 September 2023

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు జీవన విధానంలో కొన్ని మార్పులు చేయక తప్పదు. ఖర్చుల నియంత్రణకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

బయట తినడం తగ్గించి.. ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వండి. అవసరమైతే.. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించండి.

నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా కూడా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది.

అన్ని రకాల షాపింగ్‌లకు ఒక నెలలో ఏదో ఒక రోజును నిర్ణయించుకోండి. ఆ రోజు మాత్రమే మొత్తం కొనుగోళ్లు చేయండి.

దాంతో మీరు కొనాలనుకున్న వస్తువు అసలు మీకు అవసరమా? దానికి అంత డబ్బు పెట్టొచ్చా? వంటి విషయాలు మీకు అర్థమైపోతాయి.

ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో మీ క్రెడిట్‌ కార్డు వివరాలను సేవ్‌ చేయకండి. వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

మీ వివరాలను తెలుసుకుని.. మీ ఖర్చులు, సెర్చ్‌ను బట్టి కొనుగోళ్లను సిఫార్సు చేసే యాప్‌లకు దూరంగా ఉండండి.

ఒక నిర్దిష్ట సమయం వరకు ఖర్చులను పూర్తిగా మానేయడం వంటి కొత్త వ్యూహాలను అనుసరించండి. దీని వల్ల ఖర్చులు తగ్గుతాయి.