ఈ పండు ప్రపంచంలోనే ఖరీదైంది..
TV9 Telugu
17 February 2025
మార్కెట్లో సులభంగా దొరికే కర్బుజా రేటు కిలో 50 నుంచి 60 రూపాయలు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వీటిని పండిస్తారు.
జపాన్‌లో మాత్రమే సాగు చేసే జపనీస్ మెలోన్ రకానికి చెందిన యుబారి కింగ్ అనే కర్బుజా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు.
యుబారి పుచ్చకాయను జపాన్‌లోని హక్కైడో ద్వీపంలోని యుబారి నగరంలో పండిస్తునందున దీనికి యుబారి మెలోన్ అని పేరు పెట్టారు.
ఈ కర్బుజా దాని సువాసన, ప్రత్యేక రుచికి ప్రసిద్ధి చెందింది. ఈ కర్బుజాలో చాలా తక్కువ విత్తనాలు ఉంటాయి.
ఈ కర్బుజా మార్కెట్లో విక్రయించరట. ఇది కావాలంటే వేలంలోనే దక్కించుకోవాలి. అందుకే భారీ డిమాండ్ పలుకుతోంది.
2022 సంవత్సరంలో ఒక యుబారి పండు 20 లక్షల రూపాయలకు వేలం వేయడం జరిగింది. 2021లో ఈ పండు రూ.18 లక్షలకు విక్రయించారు.
యుబారి కింగ్ ఒక యాంటీ ఇన్ఫెక్షన్ ఫ్రూట్. దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పొటాషియంతో పాటు విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ ఎ, కాల్షియం కూడా ఇందులో ఉన్నాయి. అందుకే మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఎక్కువ.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించిన హిందూ చక్రవర్తులు వీరే..
విమానంలో ఆటోపైలట్ మోడ్ ఎలా పని చేస్తుందో తెలుసా.?
ఇంటికి అతిథులు వస్తున్నారా.? రోజ్ కొబ్బరి లడ్డు ట్రై చేయండి..