పొరపాటున కూడా వీరు పెసర పప్పు తినొద్దు..ఎందుకంటే  

07 October 2024

TV9 Telugu

Pic credit - Pexel

సాధారణంగా పప్పులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి. ఏ రకమైన పప్పును ఆహారంగా తీసుకున్నా ఈ కాయధాన్యాలు ప్రోటీన్ మంచి మూలంగా పరిగణించబడతాయి

ఆరోగ్యాన్ని ఇచ్చే పప్పులు 

నిజానికి పెసర పప్పు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. అయితే ఇది కొంతమందికి హాని కలిగించవచ్చు

పెసర పప్పు 

పోషకాహార నిపుణుడు మమతా శర్మ మాట్లాడుతూ.. కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో పెసర పప్పుని ఎక్కువగా తినకూడదు. ఇది హాని కలిగించవచ్చు

నిపుణుల అభిప్రాయం

ప్రస్తుతం రక్తపోటు సహజంగా మారింది. అయితే తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు పెసర పప్పు తినకూడదని చెప్పారు.

తక్కువ బీపీ 

పెసర పప్పు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు తినే ఆహారంలో పెసర పప్పును చేర్చుకోవద్దు.

యూరిక్ యాసిడ్

పెసర పప్పు చక్కెర స్థాయిని తగ్గించడానికి పనిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో రక్తంలో చక్కెర లెవెల్స్ తక్కువ ఉన్నవారు పెసర పప్పుకి దూరంగా ఉండాలి.

లో షుగర్ 

పెసర పప్పులో ఆక్సలేట్, ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కనుక మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు.. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లు సమస్య అధికం అవుతుంది. 

మూత్రపిండాల్లో రాళ్లు

అపానవాయువు లేదా ఉబ్బరం తో ఇబ్బంది పడుతుంటే పెసర పప్పు తినొద్దు. షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్ల కారణంగా ఈ పెసర పప్పుని జీర్ణించుకోవడంలో ఇబ్బంది పడవచ్చు.

కడుపు ఉబ్బరం