ఈ ఆరోగ్య సమస్యలున్నవారు గుడ్లు అస్సలు తినకూడదు? ఎందుకంటే 

12 September 2024

TV9 Telugu

Pic credit -  Pexels

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, శారీరక సరైన అభివృద్ధికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. శరీరంలో ప్రొటీన్ లోపం ఉంటే రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. 

ప్రోటీన్ మూలం

గుడ్లలో ప్రోటీన్ మాత్రమే కాకుండా కాల్షియం, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక గుణాలు ఉన్నాయి, ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి.

పోషకాలు మెండు 

నిస్సందేహంగా గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ అంటున్నారు. అదే సమయంలో గుడ్డు కొంతమంది ఆరోగ్యానికి హనికరం కూడా అన్నారు. 

ఆరోగ్యానికి హానికరం కూడా

ఎవరైనా జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే పొరపాటున కూడా గుడ్లు తినకండి. గుడ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి.

జీర్ణక్రియ సమస్యలు 

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు గుడ్లు తినకుండా ఉండాలి. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనను పొరపాటున కూడా తినొద్దు. 

అధిక కొలెస్ట్రాల్ 

హార్ట్ పేషెంట్లు చాలా విషయాలలో కేర్ తీసు కుంటారు. ఆరోగ్యైకరమైన ఆహారాన్ని తింటారు. ఎవరైనా గుండె సమస్యతో బాధపడుతున్నట్లయితే గుడ్లు తీసుకోవడం మానేయాలి. ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగించవచ్చు

గుండె సమస్యతో 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ కనీసం 1 గుడ్డు తినాలి. అయితే  ఏ రకమైన అలెర్జీ ఉన్నా.. గుడ్డు తినే విషయంలో వైద్యుడిని సంప్రదించండి. 

రోజులో ఎన్ని గుడ్లు తినాలి