25 August 2024
TV9 Telugu
Pic credit - Pexels
చేమ దుంపలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వీటితో చేసిన వేపుడు, పులుసు వంటి కూర రుచిని ఆస్వాదిస్తారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
చేమ దుంపల్లో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్ వంటివి అధికంగా లభిస్తాయి.
పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ మాట్లాడుతూ చేమ దుంపలతో చేసిన ఆహారం నిస్సందేహంగా ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇది కొంతమందికి హాని కలిగించవచ్చు.
చేమ దుంపల్లో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి గ్యాస్ లేదా కడుపులో ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తాయి.
చేమ దుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై చికాకు, దురద , వాపు సమస్యలు కలుగుతాయి. సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
గర్భవతిగా ఉన్న స్త్రీలు లేదా పిల్లలకు పాలు ఇస్తున్న తల్లులు చేమ దుంపలను తినే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి. నిపుణుల సలహా లేకుండా తీసుకోకూడదు.
చేమ దుంపలతో కూరను తయారు చేయబోతున్నట్లయితే.. ముందుగా వాటిని బాగా కడిగి పై తొక్క తీసివేయండి. వీటిని కోసేటప్పుడు చేతులకు వంట నూనె రాసుకోవచ్చు.