మీ రోజువారీ అలవాట్లే కిడ్నీలను దెబ్బతీస్తాయ్‌..! జర భద్రం

07 August 2024

TV9 Telugu

TV9 Telugu

కిడ్నీలు మహా గట్టి పిండాలు. ఉండేది పిడికెడే అయినా చేసే పనులు చాలా గొప్పవి. జీవక్రియల్లో భాగంగా పుట్టుకొచ్చే వ్యర్థాలను రక్తంలోంచి వడగట్టి, వాటిని మూత్రం రూపంలో బయటకు వెళ్లగొడతాయి

TV9 Telugu

శరీరంలో ద్రవాల మోతాదులను నియంత్రిస్తాయి. సోడియం, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలను సమతులంగా చేయడం నుంచి హిమోగ్లోబిన్‌ సంశ్లేషణకు తోడ్పడే ఎరిత్రోపాయిటిన్‌ హార్మోన్‌ను విడుదల వరకు ఎన్నో పనులు చేస్తుంటాయి

TV9 Telugu

అయితే నేటి కాలంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. క్రమరహిత జీవనశైలి ఈ వ్యాధికి ప్రధాన కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

కిడ్నీ స్టోన్ ఏర్పడటం వల్ల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల కిడ్నీ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోవాలి

TV9 Telugu

కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణం తగినంత నీరు త్రాగకపోవడం. రోజుకు 3-4 లీటర్ల నీటిని తాగాలి. మీరిప్పటికే ఏదైనా ఇతర దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే వైద్యుల సలహా తప్పక తీసుకోవాలి

TV9 Telugu

చాలామంది మూత్ర విసర్జన ఎక్కువ సేపు ఆసుకుంటుంటారు. ఈ విధమైన అలవాటు మూత్ర నాళంపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా కిడ్నీలు దెబ్బతింటాయి. టాక్సిన్ శరీరంలో ఎక్కువ కాలం ఉంటే, ఇన్ఫెక్షన్ సంభవించవచ్చు

TV9 Telugu

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అధిక మధుమేహం మూత్రపిండాల నష్టాన్ని మరింత పెంచుతుంది. అలాగే ప్రతి చిన్న నొప్పికి పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ తీసుకోవడం మానుకోవాలి. ఇవి కిడ్నీ సమస్యలను కలిగిస్తాయి

TV9 Telugu

బరువు పెరగడం వల్ల కిడ్నీపై కూడా ఒత్తిడి పడుతుంది. కాబట్టి మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. రోజూ వ్యాయామం చేయడం ద్వారా బరువు అదుపు చేసుకోవచ్చు