దక్షిణ భారతంలో ఈ తీరప్రాంత నగరాలు వేసవి టూర్‌కి ది బెస్ట్..
19 May 2025
Prudvi Battula
వైజాగ్ (విశాఖపట్నం) తీరప్రాంత నగరం. ఇక్కడ ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ వంటి ప్రశాంతమైన బీచ్‌లు ఉన్నాయి. ఈ పట్టణంలో పచ్చని కొండలు, దేవాలయాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ నుంచి సముద్రాన్ని చూడవచ్చు. బీచ్ దగ్గర ఆహారం రుచికరమైన ఆహారం లబిస్తుంది. స్పైసి ఫుడ్ ఇష్టపడితే ఇక్కడ ఆహారం మరింత నచ్చుతుంది.
కన్యాకుమారి భారతదేశం దక్షిణ కోణంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే ప్రాంతం. వేసవి టూర్ కోసం మంచి ఎంపిక.
మంగళూరు నగరం మిగతా నగరాల మాదిరిగా అంతగా ప్రసిద్ధి చెందలేదు. ఇక్కడి బీచ్‌లు ప్రశాంతంగా, శుభ్రంగా చుట్టూ తాటి చెట్లుతో ఆహ్లదకరంగా ఉంటాయి.
అలప్పుజ లేదా అల్లెప్పీ, బ్యాక్ వాటర్ హౌస్ బోట్లకు ప్రసిద్ధి చెందింది. కానీ అక్కడ విశాలమైన, ప్రశాంతమైన బీచ్‌లు కూడా ఉన్నాయి.
రామేశ్వరం సముద్రంలో నీరు చాలా స్పష్టంగా, నీలం రంగులో ఉంటుంది. పంబన్ వంతెన పట్టణాన్ని ప్రధాన భూభాగానికి కలుపుతుంది. రామనాథస్వామి ఆలయం ప్రసిద్ధి.
పాండిచ్చేరి బీచ్‌లు, ఫ్రెంచ్ కాలనీకి ప్రసిద్ధి చెందిన తీర పట్టణం. ఇక్కడ ఫ్రెంచ్ బేకరీల్లో ఫుడ్ రుచికరంగా ఉంటుంది.
కొచ్చిన్ అని కూడా పిలువబడే కొచ్చి, కేరళలో ఉంది. ఫోర్ట్ కొచ్చి వద్ద చైనీస్ ఫిషింగ్ వలలను చూడవచ్చు. పాత పోర్చుగీస్ చర్చిలు, డచ్ భవనాలు వీక్షించవచ్చు.