27 September 2023

ఈ అలవాట్లు ఉన్నవారికి షుగర్ రావడం ఖాయం

శారీరక శ్రమ చేయనివారు శరీరానికి పోషకాలు అందటం తగ్గి జీవక్రియ మందగిస్తుంది.  ప్రతి రోజు కనీసం 2 గంటలు అయిన వ్యాయామం చేయాలి.

ఒత్తిడి మరియు డిప్రెషన్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి ఎక్కువైనప్పుడు శరీరంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్  స్థాయి పెరిగి తద్వార షుగర్ వ్యాధి వచ్చే అవకాశంపెరుగుతుంది.

నిద్రలేమి ఉన్నవారికి ఆరోగ్యం క్షీణించటమే కాకుండా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం కూడ ఉంటుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి చెక్కెర స్థాయి పెరగటం ప్రారంభంఅవుతుంది.

మనం తీసుకునే ఆహరం లో ఫైబర్ లేకపోవడం వల్ల ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. తద్వారా  ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి మధుమేహానికి దారి తీస్తుంది

సిగరెట్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం లో చెక్కెర స్థాయి పెరిగి మధుమేహానికి దారి తీయటమే కాక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరం లో చెక్కెర స్థాయి పెరుగుతుంది. అందువల్ల నిద్రలేచిన గంటలోపు అల్పాహారం తప్పక తీసుకోవాలి.