యువతలో పెరుగుతున్న హార్ట్ ఎటాక్స్‌‌కు కారణాలు ఇవేనట..

Phani CH

29 Jul 2025

Credit: Instagram

మారుతున్న జీవన శైలి వల్ల యువత సమయానికి తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం నిద్ర లేకపోవడం గుండె పోటుకు కారణాలు అవుతున్నాయి.

ఆధునిక జీవనశైలిలో ప్రతి మనిషికి పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు యువతలో పెరుగుతున్నాయి. దీని వల్ల ఆందోళన, డిప్రెషన్ తో పాటు గుండె జబ్బులకు కూడా దారి తీస్తున్నాయి.

ముఖ్యంగా చెడు అలవాట్లకు బానిసలు కావడం. పొగ తాగడం వల్ల అధికంగా మద్యం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, గుండె కండరాలు బలహీనపడతాయి.ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

కొకైన్, యాంఫెటమైన్‌లు వంటి డ్రగ్స్ తీసుకోవడం గుండెపోటుకు ప్రత్యక్ష కారణం కావచ్చు. ఇవి గుండె లయను అస్తవ్యస్తం చేసి.. రక్తనాళాలను తీవ్రంగా సంకోచింపజేసి గుండెపోటుకు దారితీస్తాయి.

అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే.. మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట 

యువత తరచుగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల సమయానికి చికిత్స అందక పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం  పెరుగుతుంది.