జుట్టు రాలటానికి ప్రధాన  కారణాలు ఇవే..

Phani.ch

22 May 2024

ప్రస్తుతం యూత్ కి ఉన్న సమస్యల్లో ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని లో జుట్టు రాలడం లేదా జుట్టు పల్చబడడం అనేది రెండు రకాల ఉన్నాయి.

జుట్టు రాలడానికి చికిత్స చేస్తే మీ జుట్టు రాలడం సమస్య కూడా పరిష్కారమవుతుంది. జుట్టు రాలడానికి  కొన్ని ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వల్ల కావచ్చు. థైరాయిడ్ రుగ్మతలకు సరైన చికిత్స తీసుకుంటే కొత్త జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది.

తీవ్రమైన శారీరక ఒత్తిడి వల్ల కూడా జుట్టు పెరుగుదలకు అంతరాయం కలిగిస్తుంది. దీని వల్ల జుట్టు రాలడానికి లేదా జుట్టు పల్చబడటానికి దారితీయవచ్చు. 

 ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, కొన్ని రకాల  వైద్య  చికిత్సల వల్ల కూడా జుట్టు కుదుళ్లను దెబ్బతిని  జుట్టు రాలడానికి ప్రధాన కారణమవుతాయి.

 జుట్టు రాలడానికి  సాధారణ కారణాలలో ఒకటి వయస్సు-సంబంధిత జన్యుపరమైన రుగ్మత. చాలా మంది పురుషులు వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. ఇది క్రమంగా జరిగే విషయం.

పోషక ఆహార లోపం వల్ల కూడ జుట్టు రాలుతుంది. కొన్ని విటమిన్లు మినరల్స్ లోపిస్తే జుట్టు రాలడం జుట్టు పెరుగుదల నెమ్మదిస్తుంది.

ఐరన్, జింక్, బయోటిన్  ప్రొటీన్లు తగినంతగా తీసుకోనప్పుడు జుట్టు రాలడం జరుగుతుంది. మీరు ఈ పోషకాహార లోపాలను భర్తీ చేస్తే, మీ జుట్టు రాలడం సమస్య తగ్గించ వచ్చు. 

క్యాన్సర్, ఆర్థరైటిస్, డిప్రెషన్, గుండె జబ్బులు, గౌట్   అధిక రక్తపోటు వంటి కొన్ని వైద్య పరిస్థితులు మీరు మందులు తీసుకున్నప్పుడు దుష్ప్రభావంగా జుట్టు రాలడానికి కారణం కావచ్చు.