22 September 2023

జ్ఞాప‌క‌శ‌క్తి పెరిగేందుకు ఈ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి

జ్ఞాప‌కశ‌క్తికి ప‌దును పెట్టాలంటే ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలి ఒక్కటే చాలదు..  ఆహారం కూడా అవసరమని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు 

వ‌య‌సు పైబ‌డే కొద్దీ జ్ఞాప‌క‌శ‌క్తి తగ్గుతుంది.  అయితే కొంద‌రు విద్యార్ధుల్లోనూ జ్ఞాప‌క‌శ‌క్తి, ఏక‌గ్రాత లోపిస్తుంటుంది. ఆహారంతో మెమ‌రీని మెరుగుప‌రుచుకోవ‌చ్చు

ముఖ్యంగా నాలుగు ఆహార ప‌దార్ధాల‌తో మెద‌డు సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌రుచుకుని జ్ఞాప‌క‌శ‌క్తికి ప‌దునుపెట్టవచ్చు. బ్రెయిన్ ప‌వ‌ర్‌ను పెంచే నాలుగు సూప‌ర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం

కాలే , బ్రకోలి వంటి ఆకుకూర‌లు వ‌య‌సు పెరిగేకొద్ది త‌గ్గే జ్ఞాప‌క‌శ‌క్తిని కాపాడ‌తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబ‌ర్‌, ప్రొటీన్ పుష్క‌లంగా ఉంటాయి. 

ట్యూనా, సాల్మ‌న్ వంటి ఫ్యాటీ ఫిష్  తీసుకోవ‌డం ద్వారా అల్జీమ‌ర్ బారిన‌ప‌డే ముప్పు త‌గ్గుతుంది మెద‌డు ఆరోగ్యం కూడా మెరుగ‌వుతుంది.

బెర్రీస్‌లో  ఉండే శ‌క్తివంత‌మైన  ఫ్లేవ‌నాయిడ్స్ జ్ఞాప‌క‌శ‌క్తిని, ఏకాగ్ర‌త‌ను మెరుగుప‌రుస్తాయి. మెదడు ఆరోగ్యానికి బెర్రీస్ సూప‌ర్ ఫుడ్‌. 

కాఫీలోని కేఫిన్ షార్ట్‌ టర్మ్‌ మెమ‌రీకి  బూస్ట్‌ను అందించ‌డంతో పాటు లాంగ్‌ టర్మ్‌ జ్ఞాప‌కాల‌ను ప‌దిలం చేయడంలో సహకరిస్తుందని తాజా అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి