మనిషి చనిపోయినా ఈ 10 భాగాలు పనిచేస్తూనే ఉంటాయట..!

January 24, 2024

TV9 Telugu

మరణం సంభవించినప్పుడు శరీర నిశ్చలంగా పడి ఉంటుంది. శ్వాస ఆగిపోతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కానీ చనిపోయిన తర్వాత కూడా శరీరంలోని 11 భాగాలు పనిచేస్తాయట

ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినా చాలా కాలం పాటు ఈ భాగాలు పని చేస్తూనే ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. అందువల్లనే మృతి చెందిన వారి శరీరం నుంచి వింత శబ్దం రావడం గమనించవచ్చు

గర్భిణి చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో గర్భం లోపల చనిపోయిన శిశువు సాధారణ ప్రసవం ద్వారా బయటకు రావడం కూడా వినే ఉంటారు

వాయువు శరీరం లోపల ఒత్తిడిని పెంచడం వల్ల ఇలా జరుగుతుంది. వ్యక్తి చనిపోయిన తర్వాత గంటల తరబడి, కండరాల కదలిక ఉంటుంది. తద్వారా ఛాతీలో కదలిక కనిపిస్తుంది. పూర్తి మరణం సంభవించే వరకు కండరాలలో కదలిక ఉంటుంది

మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని జన్యువులు చురుకుగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. దీని ద్వారానే వ్యక్తి చనిపోయి ఎన్ని గంటలు, రోజులు అయ్యాయో నిపుణులు నిర్ధారించగలుగుతారు

వ్యక్తి మరణించిన కొన్ని గంటల తర్వాత కూడా మూత్ర విసర్జన అవుతుంది. వ్యక్తి చనిపోయిన తర్వాత మెదడు అవయవాలకు సిగ్నల్ పంపలేదు. అందువల్లనే శరీరం నుంచి మూత్రం లేదా మలం బయటకు వస్తుంది

చనిపోయిన తర్వాత కూడా మనిషి గోళ్లు, జుట్టు పెరుగుతాయి. కొత్త వెంట్రుకలు పెరగకపోయినా.. ఉన్న వెంట్రుకలు పెరుగుతాయి. చాలా కాలం తర్వాత గోళ్లు, వెంట్రుకలు వదులుగా మారి, రాలిపోతాయి

మనిషి చనిపోయిన తర్వాత కూడా కడుపులోని మంచి బ్యాక్టీరియా కడుపులోని ఆహారాన్ని జీర్ణం చేస్తూనే ఉంటుంది. శరీరం పూర్తిగా పనిచేయడం ఆపే వరకు జీర్ణక్రియ కొనసాగుతుంది

మనిషిలోని ఇతర అవయవాలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయినా కొన్ని రోజుల పాటు మెదడుకు పని చేసే సాంకేతికత ఉంటుంది. అలాగే చర్మ కణాలు సజీవంగా ఉంటాయి. చనిపోయిన తర్వాత కూడా పురుషులలో స్ఖలనం జరుగుతుంది