వారికి వర్షం అంటే దడ.. రీజన్ అదే.. 

15 August 2025

Prudvi Battula 

వర్షం వచ్చిదంటే చాలు.. ఎంతోమంది ఆనందంగా తడుస్తూ ఉంటారు. వీరికి వాన పడితే ఎనలేని సంతోషం వచ్చేస్తుంది.

కానీ కొందమంది వర్షం పడిందంటే బయపడిపోతూ ఉంటారు. దీనినే వైద్య పరిభాషలో 'ఒంబ్రొఫోబియా'అని అంటారు డాక్టర్లు.

కొంతమందికి వర్షంలో వరదల వల్ల ఆత్మీయులను కోల్పోవడం వంటి కొన్ని చేదు అనుభవాలు వాన అంటేనే భయపడేలా చేస్తాయి.

కొందరు ఓసీడీ ఉంటుంది. ఇలాంటివారు వర్షంలో ఇల్లు అపరిశుభ్రంగా మారితే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అది క్రమంగా ఒంబ్రొఫోబియాకు దారితీస్తుంది.

వంశపారంపర్యంగా వచ్చే మానసిక ఒత్తిడి, ఆందోళన ఉన్నవారికి కూడా వర్షం అంటే భయపడే లక్షణం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఒంబ్రొఫోబియాకు ఇప్పట్టివరుకు ఎలాంటి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ కొన్ని థెరపీలతో ఈ ఫోబియా అదుపులో ఉంచుకోవచ్చు.

కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్స్​పోజర్ థెరపీ వంటివి వర్షం వల్ల కలిగే భయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

సమస్య తీవ్రంగా ఉన్నవారికి వైద్యులు మందులను సూచిస్తారు. అలాగే ధ్యానం, యోగా వంటివి కూడా ఫోబియాను నియంత్రణలో ఉంచుతాయి.