భాగ్యనగరంలో మరో జూపార్క్.. ఎక్కడంటే.? 

27 August 2025

Prudvi Battula 

హైదరాబాద్‌ నగరంలో తరుచూ పెద్దఎత్తున పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో నెహ్రూ జూలోజికల్ పార్క్ కూడా ఒకటి.

త్వరలో నిర్మించబోయే ఫోర్త్‌సిటీలో మరో జూపార్క్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైల్డ్ లైఫ్ పర్యాటక ప్రదేశాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు.

అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘వన్‌తారా’ వన్యప్రాణి సంరక్షణ కేంద్రన్ని అధ్యయనం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

హెచ్‌ఎండీఏ పరిధిలో అనేక అటవీ బ్లాకులు ఉన్నప్పటికీ జూలను రక్షిత అటవీ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడానికి అనుమతి లేనందున రెవెన్యూ భూముల్లోనే చేయాల్సి ఉంది.

దీంతో ‘ఫోర్త్‌ సిటీ’ ప్రాంతంలో జూపార్కు 200 ఎకరాల్లో జూపార్కు ఏర్పాటుచేసి వెయ్యి ఎకరాల అటవీ ప్రాంతాన్ని గ్రీన్‌ బెల్టుగా చూపాలని భావిస్తోంది.

ఫోర్త్‌ సిటీ చుట్టుపక్కల తాడిపర్తి, మద్విన్, కురుమిద్ద, కడ్తాల్, నాగిలి పరిధిలో 15-16 వేల ఎకరాలు, గుమ్మడవెల్లిలో 2000 ఎకరాలతో సుమారు 18 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది.

ఈ జూపార్కులో నైట్‌ సఫారీ వంటివి ఉండేలా గుజరాత్ ‘వన్‌తారా’ ప్రాజెక్టును ఏర్పాటు చేసిన రిలయన్స్‌తో పాటు పలు ప్రైవేటు సంస్థలతో చర్చించే అవకాశం.