విటమిన్లు, పిండి పదార్థాలు, ఖనిజాలు.. ఇలా ఎన్నో పోషకాల సమాహారం చిలగడదుంప. గుండెకు రక్షణ ఇవ్వడం సహా కంటికి మేలు చేసే ఈ పదార్థం చాలా తక్కువ ధరలోనే లభిస్తుంది
TV9 Telugu
క్యాన్సర్‌ను నిరోధించడంలోనూ ఇది అద్భుతంగా పని చేస్తుంది. చిలగడదుంపలోని పోషకాలు, వాటి వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియవు
TV9 Telugu
నిజానికి, చిలగడదుంపలను చాలా మంది ఇష్టపడతారు. దీన్ని పూర్తిగా ఉడికించి, సలాడ్ లేదా సూప్‌లో వేసుకుని తినడానికి ఇష్టపడతారు. మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అనేక రకాల విటమిన్లు, పోషకాలు చిలగడదుంపలో అధికంగా ఉంటాయి
TV9 Telugu
చిలగడదుంపలో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ బి5, విటమిన్ ఇ ఉంటాయి. చిలగడదుంపల్లో బీటా కెరోటిన్‌లో కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని శరీరం విటమిన్ ఎగా మార్చుకుంటుంది
TV9 Telugu
అంతేకాకుండా, చిలగడదుంపలో నీరు, కేలరీలు, పిండి పదార్థాలు, చక్కెర, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో కొవ్వు తక్కువ పరిమాణంలో ఉంటుంది
TV9 Telugu
చిలకడ దుంప శరీర రక్తంలో తెల్ల రక్తకణాలను, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. విటమిన్ 'డి'ని పుష్కలంగా అందడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది
TV9 Telugu
సాధారణ బంగాళదుంపల కంటే చిలగడదుంప చాలా ఆరోగ్యకరమైనది. వీటిలో తక్కువ GI, అధిక మొత్తంలో ఫైబర్, బీటా కెరోటిన్ ఉంటాయి. సాధారణ బంగాళదుంపల్లో ఇన్ని పోషకాలు ఉండవు
TV9 Telugu
కానీ కొంతమంది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగాకిడ్నీ సమస్య, గుండె జబ్బులు, అలర్జీలు, మధుమేహం వంటి సమస్యలున్న వారు వీటికి దూరంగా ఉండాలి. వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు