బెల్లం పానకం.. మీ ఇంటిల్లిపాదికీ శ్రీరామరక్ష!

April 17, 2024

TV9 Telugu

శ్రీరామనవమి పండగ నాడు రాముడు పుట్టిన రోజుతోపాటు మాత్రమేకాదు సీతమ్మను కళ్యాణ మడిన రోజు కూడా. రామనవమి నాడు గుర్తొచ్చేది పానకం, వడపప్పు ప్రసాదం

రాముడు స్వయంవరానికి వచ్చినప్పుడు తీయతీయని పానకాన్ని ఇచ్చారట. అది ఆయనకు చాలా నచ్చిందట. ఇక నాటి నుంచి ప్రతి శ్రీరామనవమికి దాన్ని ప్రసాదంగా సమర్పించడం ఆనవాయితీగా వచ్చిందంటారు

పురాణ గాథలు ఎలాగున్నా.. రాములోరి పండగొచ్చేది చైత్రమాసంలో కాబట్టి ఈ మాసం నుంచే వసంత రుతువు ప్రారంభమవుతుంది. శీతాకాలం చల్లదనం పోయి, వేడిగాలులు మొదలవుతాయి

మారిన వాతావరణానికి శరీరం తట్టుకోలేక అనారోగ్య సమస్యలూ మొదలవుతాయి. వాటి బారిన పడకుండా చేసే ఔషధమే పానకం. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసేందుకు పూర్వికులు ఇలా ప్రసాదాల్లో పానకాన్ని చేర్చారు

శ్రీరామనవమి పండగ నాడు తెలుగునాటే కాదు, కన్నడ, తమిళ ప్రజలు సైతం ‘పానక’, ‘పానగం’ పేర్లతో ఈ పానియాన్ని సేవిస్తుంటారు

ఆయుర్వేదం ప్రకారం వేసవి కాలంలో వాత, పిత్త సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా ఆకలి లేకపోవడం, అజీర్తి వంటి సమస్యలకు పానకంలోని పదార్థాలు శరీరాన్ని చల్లబరిచి, జీర్ణసంబంధ సమస్యలకు చెక్‌ పెడతాయి

ఈ కాలం ఎక్కువగా ‘అమ్మవారు’ అనే సమస్యకూ ఇది నివారిణి. బెల్లంలోని ఖనిజాలు చెమట రూపంలో కోల్పోయిన పోషకాలను తిరిగి భర్తీ చేస్తాయి. ఐరన్‌, మెగ్నీషియం వంటివి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఎనీమియా బారి నుంచి కాపాడతాయి

ఇందులో కలిపే యాలకుల పొడిలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గిస్తే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, మిరియాల్లో సి, ఎ విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, కెరటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గులను దూరం చేస్తాయి