కౌగిలింతలకు అర్థాలే వేరయా.! 

TV9 Telugu

22 January 2025

వెనక నుంచి హాగ్: ఓ వ్యక్తికి మీపై చాల ప్రేమ, నమ్మకం ఉంటె.. అది మాటల్లో చెప్పలేనప్పుడు వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుంటారు.

బేర్‌ హగ్‌: ఒక వ్యక్తి మిమ్మల్ని గట్టిగా హాగ్ చేసుకుంటే మీ నుంచి విడిపోవడం వారికి ఇష్టం లేదని అర్ధం. దీన్ని ‘బేర్‌ హగ్‌ లేదా బిగి కౌగిలింత’ అంటారు.

వీపు నిమరడం: మనం చాలసార్లు హగ్‌ చేసుకొని వీపుపై నిమరడం చూస్తుంటాం. దీని అర్ధం ప్రోత్సహించడం లేదా ఓదార్చడం.

పొలైట్‌ హగ్‌: చిరునవ్వుతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే ‘పొలైట్‌ హగ్‌’ అంటారు. ఇది స్నేహితులు, పేరెంట్స్‌-చిన్నారులకు మధ్య కనిపిస్తుంటుంది.

కళ్లతో కౌగిలింత: ఒక వ్యక్తిపై అతనికి/ఆమెకు పిచ్చి ప్రేమ ఉంటె కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ ఆలింగనం చేసుకుంటారు.

లండన్‌ బ్రిడ్జ్‌ హగ్‌: శరీరాలు హత్తుకోకుండా ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేస్తే ‘లండన్‌ బ్రిడ్జ్‌ హగ్‌’ అంటారు. దీనికి అర్ధం వారి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం తప్ప మరేది లేదని అర్ధం.

నడుముపై చేతులేసి: ప్రేమించాలా? వద్దా? అనే సందేహంతో ఉన్న వ్యక్తిలు నడుముపై చేతులు వేసి ఆలింగనం చేసుకుంటారు. ఇలాంటి వారు ప్రేమలో పడిన త్వరగా విడిపోతారట!

సైడ్ హగ్: తరచుగా స్నేహితులు లేదా పరిచయస్తుల మధ్య భుజం లేదా నడుము చుట్టూ చేతులు వేసుకుని సాధారణ కౌగిలింత. ఇది స్నేహన్నీ తెలియజేస్తుంది.