ఈ మొక్కలు మీ ఇంట్లో.. దోమలు బయట.. 

TV9 Telugu

10 June 2024

వేపను పురుగుమందుగా పరిగణిస్తారు. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ దోమలు, క్రిమికీటకాదులు తరిమి కొట్టడానికి వేప ఆకులను కాల్చి పొగబెట్టేవారు.

ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే డోర్ లేదా బాల్కనీలో వేప మొక్కను నాటండి. ఇంట్లో స్థలం సమస్య ఉంటే. ఇప్పుడు బోన్సాయ్ వంటి వేప మొక్కలు లభిస్తున్నాయి.

నిమ్మగడ్డి దోమలను తరిమికొట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నమ్మకం. దీనితో దోమల నివారణ క్రీములు,  రిపెల్లెంట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.

రోజ్మేరీ మొక్క లు నర్సరీలో లభిస్తాయి. ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. ఈ మొక్కలో వచ్చే పువ్వుల వాసన ఘాటుగా ఉంటుంది. ఈ వాసనకు దోమలు పారిపోతాయి.

ఈ పువ్వులు ఇంట్లో పురుగుమందుగా  ఉపయోగించవచ్చు.  పువ్వులను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టి ఆ నీటిని పురుగులు రాకుండా చల్లాల్సి ఉంటుంది.

తులసి ఇంటి బాల్కనీ లేదా మెయిన్ డోర్ వంటి ప్రదేశాల్లో పెట్టుకోవచ్చు.  ఆ స్థలాన్ని శుభ్రం చేయడంతోపాటు దోమలు ఇంట్లో రావడాన్ని నియంత్రిస్తుంది.

క్యాట్నిప్ పుదీనా ఆకులను పోలి ఉండే మొక్క ఈ మొక్క దోమల నుండి మాత్రమే కాదు.. ఇతర కీటకాలు, సాలెపురుగుల నుండి కూడా రక్షించడంలో సహాయపడుతుంది.

అజెరాటం లేత నీలం, తెలుపు పువ్వులను కలిగి ఉంటుంది. ఈ పువ్వుల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఈ వాసన ప్రభావం వల్ల చుట్టుపక్కల దోమలు రావు.