అయోధ్య టూర్ ప్లాన్ చేశారా.? ఇవి కూడా చూసి రండి.. 

05 June 2025

Prudvi Battula 

గత ఏడాది హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిరం జరిగింది. చాలామంది బాలరాముడి దర్శనానికి వెళ్తున్నారు.

మీరు కూడా అయోధ్య వెళ్ళడానికి ప్లాన్ చేస్తే మాత్రం రామ మందిరంతో పాటు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి.

కనక్ భవన్ ఆలయం: సీతారాములకు అంకితం చేయబడిన ఈ ఆలయం బంగారు స్తంభాలు అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది.

సీతా కి రసోయి: ఇది సీత ఆహారం వండుకున్న వంటగది. ప్రశాంతమైన తోటల మధ్య పురాతన రామాయణ పురాణాలతో చరిత్రకు కనెక్ట్ చేస్తుంది.

త్రేతా కే ఠాకూర్: రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసిన ఆలయం. ఇది అయోధ్యలోని నయా ఘాట్ వద్ద ఉంది.

నాగేశ్వరనాథ్ ఆలయం: సరయు నది ఒడ్డిన ఉన్న ఈ శివాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రశాంతమైన వాతావరణం, అందమైన నది దృశ్యాలకి ప్రసిద్ధి.

సూరజ్ కుండ్: ఇది పురాతన నీటి ట్యాంక్‌. శ్రీరాముడు ఉపయోగించాడని నమ్ముతారు. ఈ చారిత్రక ప్రదేశంలోని ప్రశాంత వాతావరణం అస్యాదించవచ్చు.

చోటి దేవకాళి ఆలయం: ఇది జనసమూహానికి దూరంగా ఉన్న కాళి ఆలయం. అడవులు, పచ్చదనం మధ్య విల్లసిల్లుతుంది ఈ టెంపుల్.