రాజస్థాన్‌లోని ఈ కోటలు మహాద్భుతం.. వింటర్ టూర్‎కి బెస్ట్.. 

Prudvi Battula 

Images: Pinterest

09 December 2025

రాజస్థాన్‌లోని గొప్ప చరిత్ర, రాజ వారసత్వం, యోధుల స్ఫూర్తి, గొప్ప వాస్తుశిల్పన్ని ప్రదర్శించే కోటలు ఉన్నాయి.

రాజస్థాన్‌

బ్లూ సిటీకి 400 అడుగుల ఎత్తులో ఉన్న మెహ్రాన్‌గఢ్ కోట భారతదేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. వింటర్ సమయంలో చాలా భాగుంటుంది.

మెహ్రాన్‌గఢ్ కోట, జోధ్‌పూర్

చిత్తోర్‌ఘర్ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇక్కడ విజయ్ స్తంభం, రాణి పద్మిని ప్యాలెస్, కీర్తి స్తంభాన్ని చూడవచ్చు.

చిత్తోర్‌ఘర్ కోట, చిత్తోర్‌గఢ్

రాజ్‌పుత్, మొఘల్ వాస్తుశిల్పాల అద్భుతం ఈ కోటాలో చూడొచ్చు. దాని రాజవంశ అంతర్గత అలంకరణలు బాహ్య ఆకృతికి భిన్నంగా ఉంటాయి.

అబ్మేర్ కోట, జైపూర్

చైనా గ్రేట్ వాల్ తర్వాత రెండవ అతి పెద్ద గోడ కలిగిన దుర్భేద్యమైన కుంభాల్‌గఢ్ కోట. ఇక్కడ మహారాణా ప్రతాప్ జన్మస్థలాన్ని చూడవచ్చు.

కుంభాల్‌గఢ్ కోట, రాజ్‌సమంద్

యుద్ధంలో ఎప్పుడూ జయించబడని మైదానాలు జునాగఢ్ కోట ప్రత్యేకత. 37 రాజభవనాలు, దేవాలయాలు, మంటపాలను కలిగి ఉంది.

జునాగఢ్ కోట, బికనీర్

ఇతర కోటల మాదిరిగా కాకుండా దీని లోపల ఒక సజీవ నగరం ఉంది. ఇక్కడ సూర్యాస్తమయం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

జైసల్మేర్ కోట, జైసల్మేర్

తారాఘర్ కోట రాజస్థాన్‌లోని పురాతన కొండ కోటలలో ఒకటి. అద్భుతమైన దృశ్యాలు, రాజ్‌పుత్ వాస్తుశిల్పం దీని ప్రత్యేకత.

తారాఘర్ కోట, బుండి