సన్‌ఫ్లవర్‌ విత్తనాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా ??

Phani CH

02 OCT 2024

రోజుకొక స్పూన్ పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పొద్దుతిరుగుడు విత్తనాలలో మంచి కొవ్వు అధికంగా ఉంటుంది. ప్రతి రోజు తినడం వల్ల చెడు కొవ్వును కరిగించి గుండెకు మేలు చేస్తుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్‌ ఈ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్‌ నుంచి కణాలు పడవకుండ చూస్తుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే సెలీనియం రోగనిరోధకశక్తిని  పెంచడం లో మంచిగా సహాయపడుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు దరి చేరవు

సన్‌ఫ్లవర్‌ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా పుష్కలంగా ఉండడం వల్ల ర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

సన్‌ఫ్లవర్‌ విత్తనాల్లో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణం వేగంగా అవుతుంది. మలబద్ధకం సమస్య దరి చేరకుండా ఉంటుంది. 

సన్‌ఫ్లవర్‌ విత్తనాలను తీసుకోవడంతో రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంటాయి. డయాబెటిస్‌ కంట్రోల్‌డయాబెటిస్‌ కంట్రోల్‌ చేస్తుంది. 

సన్‌ఫ్లవర్‌ విత్తనాలు తింటే ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తకుండా చేసి  ఎముకలను దృఢంగా ఉండేలా మార్చుతుంది.